డిసెంబర్ లోపు విశాఖ నుంచే ఏపీ పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు.విశాఖలో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేస్తున్నట్లు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభించిన సీఎం జగన్.. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. విశాఖ ఇన్ఫోసిస్ వల్ల 4,160 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. మెుదట వెయ్యి మంది నియామకాలు చేసుకొని, దశల వారీగా పెంచుతామన్నారు. ఇక సీఎం ఈ కార్యక్రమం తర్వాత పరవాడ, అచ్యుతాపురం సెజ్ల్లోని ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవం సహా 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించనున్నారు.