ఏప్రిల్ తొలి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేసామని పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని తెలిపారు. మెగా డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలని, జూన్ లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇస్తామని స్పష్టం చేశారు.