యోగాలో ఏపీ ట్రెండ్ సెట్టర్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పాఠశాలలు తెరిచిన వెంటనే యోగా ప్రారంభించాలని సూచించారు. యోగా ఒక సిలబస్ గా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒకటే మార్గం అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు చంద్రబాబు.