తాడికొండ నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అంతక ముందు దళిత యువకుడు ప్రవీణ్ మెకానిక్ షాప్‌కి సీఎం స్వయంగా వెళ్లారు. ఇంటి పెద్దలా తనతో చేసిన ఆత్మీయ సంభాషణతో దళిత యువకుడి జీవితానికి భరోసా దొరికింది. బైక్ మెకానిక్‌ల సమస్యలు ప్రవీణ్ ద్వారా తెలుసుకున్నారు బాబు. ప్రవీణ్ కు శిక్షణ ఇచ్చి, మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు అక్కడికక్కడే సీఎం ఆదేశాలు ఇచ్చారు.