Tirumala: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి మెుక్క చెల్లించారు. బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు.