తెలంగాణకు చెందిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కూనంనేని వ్యాఖ్యలను ప్రస్తావించారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో సీఎం ఉన్న సమయంలో.. ఏ ఇజం లేదని తాను అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారన్నారు. ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని సీపీఐ ఎమ్మెల్యే స్టేట్‌మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. తన మాటలు, ఆలోచలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించారు.