స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసుకున్న బెయిల్ పిటిషన్లను రద్దు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు, దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువరించింది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును మధ్యాహ్నం వెలువరించనుంది. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీపై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.