కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నారంటే దానికి చంద్రబాబు ప్రభుత్వ మద్దతే కారణం అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఇవాళ దీక్ష చేసిన షర్మిల, బీజేపీ, చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేశారు. కార్మికులను తొలగించి, సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర బీజేపీ చేస్తోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. చంద్రబాబు, పవన్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.