వాలంటీర్ల అంశంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదని తెలిపారు. 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పొడిగింపునకు వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని గుర్తు చేసిన ఆయన.. తాను వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే క్రమబద్ధీకరించేవాళ్లమని స్పష్టం చేశారు.