మెగా డీఎస్సీపై ఏపీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటిస్తామని అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై ఇవాళ చర్చ ప్రారంభమైంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధుల అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాలోకేష్ బడ్జెట్ పద్దులపై చర్చించారు.