జగన్ డైరెక్ట్ గా ఎప్పుడూ ఫైట్ చేయలేరని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కుల, మత, ప్రాంతీయ విబేధాలు, రాజకీయ విబేధాలు రెచ్చగొట్టటమే వైసీపీ లక్ష్యమని మండిపడ్డారు. గురువారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మీ దంపతులకు ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు.