ఏపీకి కుంకీ ఏనుగులు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వం చొరవతో ఈ పని జరిగింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతులు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.