అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు-ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని.. సీఐడీ అధికారులను ఆదేశించింది. అటు అంగళ్లు కేసులో తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్ లో స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ CM చంద్రబాబు పేరును చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. దీంతో చంద్రబాబుకు కొంత ఊరట దక్కినట్లు అయ్యింది.