AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మరో ఊరట లభించింది. అంగళ్ల కేసులో చంద్రబాబుకు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో A1గా ఉన్న చంద్రబాబు ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే కారణంతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్ని సందర్శించేందుకు వెళ్లారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో పర్యటించారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా పర్యటన సందర్భంగా అంగళ్లు మీదుగా వెళ్తున్న సమయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.