CM Jagan Kadapa Tour: జలాశయంలో బోటింగ్.. ప్రకృతి అందాలను ఆస్వాదించిన సీఎం జగన్-ap cm ys jagan boating at chitravathi reservoir in pulivendula ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan Kadapa Tour: జలాశయంలో బోటింగ్.. ప్రకృతి అందాలను ఆస్వాదించిన సీఎం జగన్

CM Jagan Kadapa Tour: జలాశయంలో బోటింగ్.. ప్రకృతి అందాలను ఆస్వాదించిన సీఎం జగన్

Published Dec 02, 2022 04:34 PM IST HT Telugu Desk
Published Dec 02, 2022 04:34 PM IST

  • CM YS Jagan Boating at Chitravathi Reservoir: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం పార్నపల్లి రిజర్వాయర్‌(చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌)కు చేరుకున్న సీఎం జగన్‌.. బోటింగ్ జెట్టీని ప్రారంభించారు. ఇక్కడ రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. బోట్టింగ్ జెట్టిన ప్రారంభించిన సీఎం... స్వయంగా అందులో కొద్దిసేపు ప్రయాణం చేశారు. మరోవైపు పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును కూడా సీఎం ప్రారంభించారు. ఇక బోటింగ్ లో భాగంగా పాంటున్ బోటు (15 కెపాసిటీ),డీలక్స్ బోట్ (22కెపాసిటీ), 6 సీటర్ స్పీడ్ బోట్ ,4 సీటర్ స్పీడ్ బోట్ లు ఉన్నాయి.అలాగే పర్యాటకుల భద్రతా చర్యల్లో బాగంగా స్టేట్ డిసాస్టర్ రిస్క్యూ (ఎస్ డి ఆర్) బోట్, ఫైర్ సర్వీస్ బోట్ లను,లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. అంతకుముందు దిగంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. లేక్ వ్యూ పాయింట్ వద్ద నుంచి ముఖ్యమంత్రి రిజర్వాయర్ అందాలను కూడా తిలకించారు.

More