ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా భారతీయులదేనని చెప్పారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025’ పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ ఐఐటీ ఎన్నో విషయాల్లో నంబర్ వన్‌గా ఉందన్న సీఎం.. ఆన్‌లైన్ కోర్సులు కూడా అందిస్తోందని చెప్పారు. ఇక్కడ సుమారు 35 నుంచి 40 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారని అన్నారు. ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు కొనియాడారు.