వైసీపీ శాసన సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు దొంగల్లా వచ్చి.. సంతకాలు చేసి వెళ్లిపోవటం ఏంటని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని సూచించారు. సమస్యలపై మాట్లాడాలని సభాపతి వారికి సూచించారు.