అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ప్రసంగించారు. అంతా ఆశ్చర్యపడేలా.. ఇంగ్లీషు ప్రసంగంతో అదరగొట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులు అమెరికా తీసుకెళ్లారు. వీరు అక్కడ పలు వేదికల మీద ప్రసంగిస్తున్నారు.రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలు గురించి వివరిస్తున్నారు. విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ సైతం అభినందించారు.