Ganja Destroy in Andhrapradesh: గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు ఏపీ పోలీసులు. విశాఖ రేంజ్ పరిధిలో పట్టుబడిన దాదాపు రెండు లక్షల కేజీల గంజాయిని, 131 లీటర్ల హాష్ ఆయిల్‌ను పోలీసులు దహనం చేశారు. అనకాపల్లి జిల్లాలోని కోడూరులోని నిర్మానుష్య ప్రదేశంలో శనివారం ఈ గంజాయి దహనం కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీటి విలువ మొత్తం రూ. 240 కోట్లుగా ఉంటుందని… గంజాయి రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా డీఐజీ త్రివిక్రమ్ వెల్లడించారు. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టినట్టుగా చెప్పారు. ఈ ఏడాదిలో నమోదైన కేసులు వివరాలను కూడా వెల్లడించారు.