ఆంధ్రప్రదేశ్ లోని కడపలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో నివాసం ఉంటున్న పోలీసు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీ కాల్చి చంపేశాడు. ఆపై వెంకటేశ్వర్లు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కడప ఒక్కసారి ఉలిక్కిపడింది. కాలనీవాసులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంకటేశ్వర్లు నగరంలోని టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్. ప్రస్తుతం రైటర్‌గా పని చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఒక తుపాకీని తన వెంట తెచ్చుకున్నాడు వెంకటేశ్వర్లు. మెుదట ఇంటికి వచ్చాక భార్యాబిడ్డలను చంపాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అప్పులు, ఆర్ధిక సమస్యల వల్ల కుటుంబ కలహాలున్నట్లు బంధువులు వెల్లడించారు.