Sandal wood Seized in Tirumala: తిరుమలలో పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల నుంచి తిరుపతి వచ్చే మార్గంలో గాలి గోపురం వద్ద అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 9 మంది స్మగర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 85 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. కోటి 20 లక్షల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.