Treasure in Eluru : పైప్‌లైన్ కోసం తవ్వుతుండగా.. పొలంలో బంగారం
- ఏలూరు జిల్లాలోని జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఆయిల్ ఫామ్ తోటలో పైప్‌లైన్ కోసం తవ్వుతున్నారు. ఈ క్రమంలో మట్టి కుండ కనిపించింది. అది తెరిచి చూస్తే.. 18 బంగారు నాణేలు ఉన్నాయి. ఈ విషయం తహసీల్దార్‌కు ఆయిల్ ఫామ్ రైతు సమాచారం ఇచ్చాడు. అధికారులు వాటిని పరిశీలించి తీసుకెళ్లారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాముల వరకు ఉంటుంది.