YS Jagan On Capital : త్వరలో విశాఖపట్నానికి రాజధాని…సిఎం జగన్
- ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ పట్నం రాజధాని కాబోతుందని, త్వరలోనే విశాఖపట్నంలో రాజధాని ఏర్పడుతుందని, తాను కూడా అక్కడికే వెళుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని కాబోతున్న విశాఖపట్నానికి పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలనికోరారు. న్యూ ఢిల్లీ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ డిప్లమాటిక్ అలయన్స్ మీట్‌లో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. మార్చిలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం తరలి రావాలని సిఎం విజ్ఞప్తి చేశారు.