గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం(ఏఐ171) టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతమైన మేఘానీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీతో సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.