Tirumala Tirupati Devasthanams (TTD), తిరుమల తిరుపతి సమాచారం, తిరుమల దర్శనం

Latest ttd Photos

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మార్చి 24న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Tirumala Updates : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్-ఈ నెల 25, 30న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Sunday, March 23, 2025

మనుమడి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. దేవాన్ష్‌ పుట్టిన రోజు కావడంతో అన్నదానానికి రూ.44లక్షల విరాళం ఇచ్చారు.

CBN In Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం, దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం

Friday, March 21, 2025

స్థానికులకు తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఆదివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

Tirumala Local Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్, మార్చి 2న స్థానికుల దర్శన టోకెన్ల జారీ

Saturday, March 1, 2025

మే నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Tirumala Special Entry Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Sunday, February 23, 2025

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లపై అప్డేట్ వచ్చింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా దర్శనం టికెట్ల షెడ్యూల్ విడుదల

Monday, February 17, 2025

ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

Tirumala Ratha Saptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీమన్నారయణుడు

Tuesday, February 4, 2025

వైకుంఠ ఏకాదశి నాడు గోవింద మాల ధారణతో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు

Vaikunta Ekadasi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, భక్తులతో కిటకిట, గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు

Friday, January 10, 2025

తిరుపతి తొక్కిసలాటలో భర్తను కోల్పోయి విలపిస్తున్న  మహిళ, నర్సీపట్నంకు చెందిన బాబురావు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.

AP Minister In Tirupati: తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం, బాధితులకు సీఎం పరామర్శ

Thursday, January 9, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతి స్థానికులకు ప్రత్యేక కోటా కల్పిస్తున్నారు. 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి 5న స్థానిక కోటా టోకెన్లు జారీ

Monday, December 23, 2024

వడ్ల గింజలు, పసుపు గడ్డలు, వట్టి వేరు, బ్లాక్ గ్రేప్స్, రోజ్ పెడల్స్, తులసి మాల‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. త‌మిళ‌నాడులోని తిరుపూర్‌కు చెందిన దాతలు ఈ మాల‌లను విరాళంగా అందించారు.

Tiruchanoor : వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం - పుష్కరిణి స్నానంతో భక్తుల తన్మయత్వం, ఫొటోలు

Friday, December 6, 2024

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

Tirumala : సప్తవర్ణ శోభితం.... తిరుమల శ్రీవారి పుష్పయాగం - ఫొటోలు

Sunday, November 10, 2024

తిరుపతి రైల్వే స్టేషన్‌ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. అధ్మాత్మిక నగరం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఏకంగా రూ.300కోట్ల రుపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంల పైభాగాన్ని కూడా వినియోగించుకునేలా నిర్మాణాలు చేపట్టారు. అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది.

Tirupathi Ralway Station: తిరుపతి రైల్వే స్టేషన్‌ ముఖచిత్రం చూశారా.. త్వరలో మారిపోతున్న రూపురేఖలు

Sunday, October 20, 2024

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.

Tirumala Brahmotsavam 2024 : శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని చక్రస్నానం - నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Saturday, October 12, 2024

అశ్వవాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో 14 వాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు.

TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... అశ్వవాహనంపై మలయప్పస్వామి దర్శనం - ఫొటోలు

Friday, October 11, 2024

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు.

TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. కనులపండువగా దేవదేవుడి మహా రథోత్సవం - ఫొటోలు

Friday, October 11, 2024

రథోత్సవంలో ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు కనువిందు చేసిన మలయప్ప స్వామి

TTD Brahmotsavalu: వైభవంగా మలయప్ప స్వామి రథోత్సవం, భక్తజనసంద్రంగా మారిన తిరుమల మాడవీధులు

Friday, October 11, 2024

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప - ఫొటోలు

Thursday, October 10, 2024

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

Tirumala Hanumantha Vahanam: కోదండరాముని అవతారంలో హనుమంత వాహనంపై శేషాచలాధీశుడు, కన్నుల పండుగగా తిరుమల బ్రహ్మోత్సవాలు

Wednesday, October 9, 2024

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తనకు ఎంతో ఇష్టమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. మంగళవారం సాయంత్రం గరుడవాహనంపై వైకుంఠ నాథుడు విహరించాడు. లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ తిరుగిరుల్లో మారుమోగాయి.

Tirumala Garuda Vahana Seva : గరుడ వాహనంపై తిరుమలేశుడు విహారం, భక్త జనసంద్రమైన తిరుమల

Tuesday, October 8, 2024

తిరుమల స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు మంగళవారం నాడు శ్రీ మలయప్ప విశ్వసుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Srivari Brahmotsavam : విశ్వసుందరి మోహిని రూపంలో దర్శనమిచ్చిన శ్రీవారు.. విశ్వమంతా తన మాయ సృష్టి అని సందేశం

Tuesday, October 8, 2024