trending-ap News, trending-ap News in telugu, trending-ap న్యూస్ ఇన్ తెలుగు, trending-ap తెలుగు న్యూస్ – HT Telugu

Latest trending ap Photos

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల(ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ లబ్ధిదారులను గుర్తించి, పథకాలను వర్తింపజేసేందుకు కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ రిజిస్ట్రీలో ఉన్న వాళ్లకు మాత్రమే పీ‌ఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఇతర వ్యవసాయాధారిత పథకాలు వర్తింప చేయనున్నారు.

AP Farmer Registry : పీఎం కిసాన్ సహా వ్యవసాయ పథకాలు పొందాలా?- ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి, రిజిస్ట్రేషన్ ఇలా

Friday, February 14, 2025

కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకుతుంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారిగా కోడి మాంసంతో పాటు గుడ్ల వినియోగం భారీగా తగ్గిపోయింది. ఇటు పశుసంవర్ధక, రెవెన్యూ, అటవీ, పోలీస్, వైద్య శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫారాలను పరిశీలిస్తున్నారు. అస్వస్థతకు గురైన కోళ్లను బయటకు వదులుతున్నారు.

AP TG Bird Flu : బర్డ్‌ ఫ్లూ భయం.. తగ్గిన మాంసం, గుడ్ల వినియోగం.. వైరస్ సోకిన కోళ్లను ఎలా గుర్తించాలి?

Thursday, February 13, 2025

రైతన్నలకు ఆధార్ కార్డుల తరహాలో 11 నెంబర్ల విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. రైతు సేవా కేంద్రాల్లో 'ఫార్మర్ రిజిస్ట్రీ' పేరుతో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా కర్నూలు, నంద్యాలలో ఏడుగురు రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమదు  చేసి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించారు.

AP Farmer Registration : ఏపీ రైతులకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు వివరాలు నమోదు-ఏ పత్రాలు కావాలంటే?

Saturday, February 8, 2025

గోల్డెన్ అవర్ లో వ్యక్తి ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు ఓ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ పేరు టెనెక్టెప్లేస్. దీని ఖరీరు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్ ను పేదలు కొనుగోలు చేయలేక ప్రాణాలు విడిచిన సందర్భాలు లేకపోలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంజెక్షన్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

Injection For Heart Attack Patients : రూ.45 వేలు ఖరీదైన గుండెపోటు ఇంజెక్షన్ ఉచితంగా, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Saturday, February 8, 2025

పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ సహాయంతో పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. ఎక్కడో చెట్ల మధ్యలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ కెమెరాతో గుర్తించి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు.

Vijayawada Police Drones : పేకాట రాయుళ్ల పనిపట్టిన డ్రోన్లు, విజయవాడ సిటీ పోలీసుల వినూత్న నిఘా

Monday, February 3, 2025

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 2 ప్రారంభమైన ఉత్సవాలు మూడ్రోజుల పాటు జరగనున్నాయి. తొలిరోజు ఆదివారం రథసప్తమి ఉత్సవాల శోభయాత్ర ఎంతో వైభవంగా సాగింది.

Arasavalli Ratha Saptami : అంగరంగ వైభవంగా అరసవల్లి రథసప్తమి ఉత్సవాలు, ప్రత్యేక ఆకర్షణగా హెలీకాఫ్టర్ రైడ్

Monday, February 3, 2025

విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక గ్రామంలో తయారయ్యే ఈ లక్క బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. వరాహానది పక్కన ఉండే ఓ చిన్న గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉంటారు. అంకుడు కర్రతో సహజ రంగులను ఉపయోగించి మనసుకు హత్తుకునే కళాఖండాలను తయారుచేస్తారు. చింతలపాటి వెంకటపతిరాజు అనే కళాకారుడు 1990లో రసాయన రంగుల స్థానంలో సహజ రంగులను వాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ బొమ్మలకు సహజరంగులే వాడుతున్నారు.

Etikoppaka Bommalu :ఏటికొప్పాక బొమ్మలు అద్భుత కళాఖండాలు- వీటి ప్రత్యేకతలు ఏంటంటే?

Wednesday, January 29, 2025

ఆ ప‌క్షి ప‌గ‌లంతా చెట్లపైన ఉంటుంది. సంధ్యా స‌మ‌యంలో నీటి వ‌ద్దకు చేరుకుంటుంది. అదే కొల్లేరు స‌ర‌స్సులో అందాల అతిథిగా ఉన్న ఓరియంట‌ల్ ప్రాటిన్‌కోల్. శీతాకాలంలో కొల్లేరుకు వ‌చ్చే ఈ అతిథికి చాలా ప్రత్యేక‌త‌లు ఉన్నాయి.

Oriental Pratincole : పగలంతా చెట్లపై సంధ్యా స‌మ‌యంలో నీటి వద్దకు-కొల్లేరు అందాల అతిథి ఓరియంట‌ల్ ప్రాటిన్‌కోల్

Monday, January 27, 2025

ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికే కాదు, పసందైన వంటకాలకూ ఫేమస్. ఆంధ్రా స్వీట్స్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోనూ ఎగబడతారు. ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డు, కాకినాడ కాజా...ఇలా స్వీట్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏపీలో ప్రాంతానికో స్వీట్ ఫేమస్. వీలుదొరికితే ఓసారి రుచిచూసేయండి.

Andhra Sweets : ఆత్రేయపురం పూతరేకులు నుంచి బందరు లడ్డు వరకు- టాప్ 10 ఆంధ్రా స్వీట్స్, ఓసారి రుచిచూడాల్సిందే!

Sunday, January 26, 2025

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై చర్చ జరుగుతుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టత ఇస్తూ..ఫిబ్రవరి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలవుతాయని చెప్పారు.

AP Registration Charges : భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఏపీ ప్రభుత్వం కసరత్తు, అమరావతికి మినహాయింపు!

Wednesday, January 22, 2025

ఈ ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం, పర్యాటకులను ఆకర్షించడం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడు రోజుల్లో సుమారు 6 నుంచి 7లక్షల మంది పర్యాటకులు ఈ ఫెస్టివల్ కు వస్తారని అంచనా వేస్తున్నారు.

Flemingo Festival 2025 : అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం, మూడ్రోజుల పాటు 5 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

Saturday, January 18, 2025

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో వైద్యులు, పారా మెడికల్ పోస్టుల ఖాళీలే సుమారు 25.97 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 1,01,125 ఉద్యోగాలలో 3114 వైద్యులు, 23149 పారామెడికల్ ఉద్యోగ ఖాళీల ఉన్నట్లు వైద్య ఆరోగ్య పేర్కొంది.

AP Medical Jobs : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో 26,263 ఖాళీలు-ముందుగా ఏడెనిమిది వేల పోస్టుల భర్తీ!

Thursday, January 16, 2025

మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.  రేపు జరిగి కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

AP Free Bus Scheme : మహిళలకు గుడ్ న్యూస్, ఫ్రీ బస్ పథకం అమలుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అప్డేట్

Thursday, January 16, 2025

రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో​అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

AP Rains : పండుగ పూట వాతావరణ శాఖ అలర్ట్, ఏపీలో మూడు రోజుల పాటు వర్షసూచన

Sunday, January 12, 2025

ఏపీలో సంక్రాంతి జోష్ మామూలుగా లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి సంక్రాంతి కావ‌డంతో అధికార కూట‌మి నేత‌లు కొత్త విన్యాసాలకు తెర‌లేపుతున్నారు. కేర‌ళ అందాల‌ను సొంత చేసుకున్న కోనసీమలో....కేర‌ళ త‌ర‌హాలో ప‌డ‌వ పోటీలు నిర్వహించారు. కోన‌సీమ జిల్లాలోని ఆత్రేయ‌పురంలో ప‌డ‌వ పోటీలు ప్రత్యేకంగా నిలిచాయి. వీటితో పాటు స్విమ్మింగ్ పోటీలు కూడా నిర్వహించారు.

Atreyapuram Boat Racing : కోనసీమలో కేర‌ళ తరహా పోటీలు, ఆత్రేయ‌పురంలో బోట్ రేసింగ్

Sunday, January 12, 2025

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది.

AP Buildings Permission : భవన నిర్మాణాల అనుమతులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, అధికారాలు మున్సిపాలిటీలకు బదలాయింపు

Sunday, January 12, 2025

ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్ విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. బుక్ ఫెయిర్ లోని ప్రతి స్టాల్ లో పుస్తకాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. పలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించారు.

Pawan Kalyan Books : విజయవాడ బుక్ ఫెయిర్ లో పవన్ కల్యాణ్, రూ.10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు

Saturday, January 11, 2025

ప్రకృతి విపత్తుల కారణంగా మనిషి చనిపోతే రూ.5 లక్షలు, ఆవులు, గేదెల మృతి చెందితే రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7,500, కోడికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. పశువుల పాక దెబ్బతింటే రూ.5 వేలు ఇస్తారు. ముంపునకు గురైన గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఇళ్లకు రూ.10 వేలు, కిరాణా షాపులు, రెస్టారెంట్లు, ఇతర షాపులకు రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

AP Govt Exgratia : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం- ప్రకృతి విపత్తుల మరణాలకు ఎక్స్ గ్రేషియా పెంపు

Wednesday, January 8, 2025

సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ దృష్ట్యా 7200 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది.

APSRTC Sankranti Specials : సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులు-టికెట్లపై 10 శాతం రాయితీ

Tuesday, January 7, 2025

పచ్చిన కొండలు.. మధ్యలో స్వచ్ఛమైన జలాశయం… ఇలాంటి చోట బోటింగ్ చేస్తే  ఆ క్షణాలను మాటల్లో వర్ణించలేం. అలాంటి అద్భుతాలకు విజయనగరం జిల్లాలోని  తాటిపూడి రిజర్వాయర్ వేదికైంది. ఇక్కడ విశేషాలెంటో ఇక్కడ చూడండి…

AP Tourism : తాటిపూడిలో 'అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్' - ఈ టూరిస్ట్ స్పాట్ అందాలను అస్వాదించాల్సిందే..!

Friday, January 3, 2025