అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా దూకుడుగానే ముందుకెళ్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 41 పరిధిలో గుర్తించిన ఆక్రమణలను తొలగించింది. దీంతో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కుకు రూట్ క్లియర్ అయిందని హైడ్రా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.