YS Sharmila : ఆ భయంతోనే మళ్లీ అమరవీరులు యాదికొచ్చారు - KCRపై షర్మిల ఫైర్-ysrtp president ys sharmila fires on cm kcr ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ysrtp President Ys Sharmila Fires On Cm Kcr

YS Sharmila : ఆ భయంతోనే మళ్లీ అమరవీరులు యాదికొచ్చారు - KCRపై షర్మిల ఫైర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 22, 2023 08:19 PM IST

YSRTP Latest News:బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. అమరుల ప్రాణ త్యాగంతోనే కేసీఆర్ అధికార వైభోగం దక్కిందని విమర్శించారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila On CM KCR: ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే కేసీఆర్ కు అమరవీరులు మళ్లీ గుర్తుకొచ్చారని విమర్శించారు వైఎస్ షర్మిల. రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే..ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు. అసువులు బాసిన అమరుల ఆశయాలు గోదారి పాలైతే .. స్వరాష్ట్ర సంపద అంతా కేసీఆర్ పాలైందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

"నిధులు మింగే, నీళ్ళు ఎత్తుకు పోయే, ఉద్యోగాలు ఇంట్లనే ఇచ్చుకునే. త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర.. అమరుల కుటుంబాలను ఆద మరిచిండు. ఇన్నాళ్లు వాళ్ళెవరో అన్నట్లు, గుర్తుకు లేనట్లు నాటకాలు ఆడిండు. ఉన్నట్లుండి 9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేల మళ్లీ పుట్టుకొచ్చే. అమరుల ప్రాణత్యాగం వెలకట్టలేనిది అంటూ కుండపోతగా ప్రేమను కురిపించే పన్నాగం పన్నుతున్నాడు. ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే అమరవీరులు మళ్ళీ యాదికొచ్చారు. రాష్ట్ర సాధనకై 1500 మంది ప్రాణాలు కోల్పోతే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు ఇది. 1200 మంది అమరవీరులయ్యారని సొంత లెక్కలు బయటపెట్టిన కేసీఆర్.. ఆదుకున్నది 528 మందిని మాత్రమే. మిగిలిన 700 మంది అమరుల త్యాగాలను.. చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేసిండు. ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కేసీఆర్" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తానని చెప్పి కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే తప్పా వారి పేర్లు ఎక్కడా చెక్కలేదని ఆక్షేపించారు షర్మిల. " ఇన్నాళ్లు గుర్తుకు రాని శంకరమ్మకు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తాడట. కొత్తగా అమరులకు న్యాయం చేస్తాడట. ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు..అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేండ్లు పట్టింది! కేసీఆర్ లాంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరించడం అంటే అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే" అవుతుందన్నారు.

WhatsApp channel
తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.