Sharmila Protest In Delhi :ఢిల్లీలో షర్మిల ఆందోళన…అదుపులోకి తీసుకున్న పోలీసులు-ysrtp president protest with her followers in delhi jantar mantar for seeking enquiry on kaleswaram project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ysrtp President Protest With Her Followers In Delhi Jantar Mantar For Seeking Enquiry On Kaleswaram Project

Sharmila Protest In Delhi :ఢిల్లీలో షర్మిల ఆందోళన…అదుపులోకి తీసుకున్న పోలీసులు

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 01:26 PM IST

Sharmila Protest In Delhi కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.18లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో నిర్మించిన లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేకపోయారని షర్మిల ఆరోపిస్తున్నారు.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన వైఎస్సార్‌టీపీ నాయకురాలు షర్మిల
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన వైఎస్సార్‌టీపీ నాయకురాలు షర్మిల

Sharmila Protest In Delhi కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నాకు దిగారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ క్రమంలో షర్మిల అనుచరులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై పార్లమెంట్‌కు వెళ్తామని కేసీఆర్ అవినీతి దేశానికి తెలియాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. షర్మిల సహా ఆ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాళే‌శ్వరం అక్రమాలపై షర్మిల పోరాటం…

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో భాగమయ్యాయని షర్మిల చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి సైతం ఆమె ఫిర్యాదు చేశారు. తెలంగాణ సిఎం చంద్రశేఖర్‌రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు పాదయాత్రకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిలను ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

షర్మిలను అడ్డుకునే క్రమంలో పోలీసులతో తోపులాటకు దిగారు. దీంతో కార్యకర్తల్ని సైతం పోలీసులు బలవంతంగా వాహనాల్లో తరలించారు. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలను దేశానికి వివరిస్తానంటూ జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వరకు 'శాంతియుత పాదయాత్ర' నిర్వహించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని షర్మిల ఆరోపిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యారంటూ దర్యాప్తు సంస్థల అధికారులపై షర్మిల విరుచుకుపడ్డారు తన నిరసన ప్రదర్శన ద్వారా పార్లమెంటు దృష్టిని తెలంగాణలో సాగిన అతిపెద్ద విఫల ప్రాజెక్టు వైపుకు ఆకర్షించాలన్నది తన ఉద్దేశమని షర్మిల తెలిపారు.

తెలంగాణలో జరిగిన కాళేశ్వరం కుంభకోణం పరిమాణాన్ని వివరించడంతో పాటు గత రెండేళ్లలో చేసిన పోరాటాన్ని యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లాడానికి జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వరకు నడుస్తానని షర్మిల ప్రకటించారు. ప్రాజెక్ట్ వ్యయం రూ. 38,500 కోట్ల నుండి రూ. 1.20 లక్షల కోట్లకు పెరిగినా, లక్షన్నర ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందిందని ఆరోపించారు. ప్రభుత్వం 18లక్షల ఎకరాలకు నీరందించిటన్లు అవాస్తవాలు చెబుతోందని కాళేశ్వరం అతిపెద్ద ఫ్లాప్ షో అని ఆరోపించారు.

ప్రాజెక్టు నిర్మాణంతో 'ఒక కాంట్రాక్టర్‌కు, ఇంకో కుటుంబానికి జేబులు నిండాయని ఆరోపించారు. "కేసీఆర్ రీడిజైన్ కుట్ర ఖజానాను దోచుకోవాలనే ఉద్దేశంతో నే చేశారని షర్మిల ఆరోపించారు. ప్రాజెక్ట్ నాణ్యత చాలా తక్కువగా ఉందని, మూడేళ్లలోనే నాసిరకం నిర్మాణంగా తేలిందని షర్మిల ఆరోపించారు. ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి, భారతీయుల డబ్బును దోచుకున్నారని, అవినీతిపై వివరణ కోరే హక్కు భారతదేశానికి ఉందని షర్మిల డిమాండ్ చేశఆరు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతోనే కేంద్ర ఆర్థిక సంస్థలు రూ. 1 లక్ష కోట్ల రుణాన్ని పొడిగించాయని, దీని వల్ల దేశం నష్టపోతుందని చెప్పారు.

IPL_Entry_Point