YS Sharmila : మీ హామీ ఏమైంది కేసీఆర్? ఎకరాకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలి-ys sharmila visits crop damage areas in janagama district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ys Sharmila Visits Crop Damage Areas In Janagama District

YS Sharmila : మీ హామీ ఏమైంది కేసీఆర్? ఎకరాకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలి

Apr 29, 2023, 04:29 PM IST HT Telugu Desk
Apr 29, 2023, 04:29 PM , IST

  • Crop Damage due to Untimely Rains: ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. ఈ నేపథ్యంలో శనివారం జనగాం, డోర్నకల్ నియోజకవర్గాల్లో పర్యటించారు షర్మిల. రైతులను పరామర్శించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు.

కేవలం రూ.5 వేల రైతుబంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రైతు ద్రోహి కేసీఆర్ అని షర్మిల మండిపడ్డారు. పంట పెట్టుబడికి, జరిగిన నష్టానికి మీరిస్తామన్న పరిహారం ఏమాత్రం సరిపోదని,,, ఎకరానికి రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

(1 / 6)

“జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో అకాల వర్షంతో నష్టపోయిన వరి పంట, మామిడి తోటలను పరిశీలించడం జరిగింది. పంట చేతికొచ్చే సమయానికి వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గాలిమోటార్లలో తిరిగి రూ.10 వేలు చెల్లిస్తామన్న కేసీఆర్ హామీ గాలి మాటలకే పరిమితమైంది” అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

(2 / 6)

హెలీకాఫ్టర్ లో వచ్చి అకాలవర్షంతో పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు చెల్లిస్తామన్న KCR హామీ ఏమైంది? అని షర్మిల ప్రశ్నించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఒక్కరైనా పట్టించుకుంటున్నారా? అని నిలదీశారు.  మీరిచ్చే రైతుబంధుతో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు.

(3 / 6)

“రైతు కాలిలో ముల్లు దిగితే నోటితో తీస్తానన్న కేసీఆర్.. రైతులు పంట నష్టపోయి ఆవేదనలో ఉంటే ముఖం చాటేశాడు. కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో పంట నష్టపరిహారం లేదు, రైతు బీమా లేదు. ఇది భరోసా ఇచ్చే సర్కార్ కాదు.. కిసాన్ బర్బాద్ సర్కార్.. మత్తు వీడి, కళ్లు తెరిచి రైతుల కష్టాలను చూడు కేసీఆర్” అంటూ  షర్మిల హితవు పలికారు. 

(4 / 6)

ఇక రేపు ఖమ్మం  జిల్లాలో షర్మిల పర్యటన సాగనుంది. మధిర, ఇల్లందు, వైరా నియోజకవర్గాల్లో షర్మిల రైతులను కలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత మే1వ తేదీన పాలేరు నియోజకవర్గంలో షర్మిల పర్యటన కొనసాగనుంది. 

(5 / 6)

పాలేరులో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు షర్మిల. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నారు. స్థానిక నాయకత్వం కూడా షర్మిల పర్యటనకు ఏర్పాట్లు చేస్తోంది. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు