YS Sharmila : TSPSC బోర్డు రద్దు కోసం సిఫార్సు చేయండి.. గవర్నర్ కు షర్మిల లేఖ-ys sharmila letter to governor tamilisai over tspsc paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila : Tspsc బోర్డు రద్దు కోసం సిఫార్సు చేయండి.. గవర్నర్ కు షర్మిల లేఖ

YS Sharmila : TSPSC బోర్డు రద్దు కోసం సిఫార్సు చేయండి.. గవర్నర్ కు షర్మిల లేఖ

HT Telugu Desk HT Telugu
Apr 19, 2023 10:22 PM IST

YS Sharmila Letter to Governor : రాష్ట్ర గవర్నర్ కు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని కోరారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila On TSPSC Paper Leak Case: ప్రశ్నపత్రాలను అమ్ముకొని లక్షలాది మంది నిరుద్యోగులతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆటలాడుకుందని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇంత పెద్ద స్కామ్ జరిగినా.. ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకుండానే మళ్లీ పరీక్షలు నిర్వహించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. ఆర్టికల్ 317 ప్రకారం విచక్షణాధికారాలను ఉపయోగించి TSPSC బోర్డు రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని కోరారు.

కొత్త టీఎస్పీఎస్సీ బోర్డును ఏర్పాటు చేయించి... పారదర్శకంగా నియామకాలు జరిపించేలా చూడాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు అండగా నిలబడాలని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’ పనితీరు నమ్మశక్యంగా లేదన్నారు. టీఎస్ పీఎస్సీ నుంచి ప్రగతి భవన్ వరకు లింకులు ఉన్నాయని చెప్పారు. ఇందులో చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రెటరీ, బోర్డు సభ్యుల దగ్గర నుంచి ప్రగతి భవన్ మంత్రుల వరకు ఉన్నారని ఆరోపించారు. పెద్దల హస్తం ఉంది కాబట్టే ఈ ప్రభుత్వానికి సీబీఐతోనో లేక సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటపడతాయని భయం పట్టుకుందని దుయ్యబట్టారు. తీగ లాగితే ఈ కేసు.. ప్రగతి భవన్ డొంక కదులుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పటివరకు పేపర్ లీకులపై సీఎం కేసీఆర్ ఈ విషయంపై కనీసం సమీక్ష చేయలేదన్నారు. కేసు విచారణ జరుగుతుండగానే దోషులు ఎవరో ఇంకా నిర్దారణ కాకముందే, రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన మళ్లీ రద్దు చేసిన పరీక్షలను నిర్వహిస్తోందని లేఖలో షర్మిల ప్రస్తావించారు.

గవర్నర్ గా విచక్షణాధికారాలు ఉపయోగించి ప్రస్తుతం ఉన్న బోర్డున రద్దు చేసేలా చూడాలని వైఎస్ షర్మిల కోరారు. ఆర్టికల్ 317 ప్రకారం రద్దు విషయమై రాష్ట్రపతికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈడీ విచారణ ముమ్మరం…

TSPSC ED Enquiry:మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది ఈడీ. చంచల్ గూడ జైల్లో రెండవ రోజు నిందితులను ఈడీ విచారించింది. ఇద్దరు అదనపు డైరెక్టర్లతో కూడిన నలుగురు సభ్యల ఈడీ బృందంతో విచారణ పూర్తి చేశారు.పేపర్‌ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. ఈడీ అధికారులు వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. కమిషన్‌లో ఉద్యోగులుగా ఎవరు.. ఎప్పుడు..ఎలా చేరారనే వివరాలను సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్ లకు చెందిన బ్యాంక్ అకౌంట్స్ వివరాలను నమోదు చేశారు. ప్రతి నెల ఎంత అమౌంట్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనే కోణంలో అరా తీసినట్లు తెలుస్తోంది.

పేపర్‌ లీక్ వ్యవహారంలో కమిషన్ బోర్డు సభ్యులు, ఇతర అధికారుల వాంగ్మూలం సైతం రికార్డ్ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్​ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా టీఎస్​పీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సెక్రటరీ అనితారామచంద్రన్​ను కూడా ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డినిమొదటి రోజు దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ, రెండో రోజు ఏడు గంటల పాటు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల మేరకు అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ఈడీ టీమ్​.. నిందితుల స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం