Young Couple Suicide : సంగారెడ్డి జిల్లాలో విషాదం - పెళ్లైన గంటల వ్యవధిలోనే యువజంట ఆత్మహత్య..!-young couple committed suicide by hanging in sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Young Couple Suicide : సంగారెడ్డి జిల్లాలో విషాదం - పెళ్లైన గంటల వ్యవధిలోనే యువజంట ఆత్మహత్య..!

Young Couple Suicide : సంగారెడ్డి జిల్లాలో విషాదం - పెళ్లైన గంటల వ్యవధిలోనే యువజంట ఆత్మహత్య..!

HT Telugu Desk HT Telugu
Jan 11, 2025 11:09 AM IST

Young Couple Suicide in Sangareddy :సంగారెడ్డి జిలాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువజంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న మునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి లో విషాదం (Representative file photo)
సంగారెడ్డి లో విషాదం (Representative file photo) (HT_PRINT)

వారిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు..! కానీ తమ ప్రేమను పెద్దలు ఒప్పకోక పోవడంతో తమ ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర సంఘటన సింగూర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న హరిత రిసార్ట్ హోటల్ లో జరిగింది. 

yearly horoscope entry point

సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్ మండల్ కేంద్రానికి చెందిన కరిపే ఉదయ్ కుమార్ (26), మంగలి రోహిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.  మౌనిక నారాయణఖేడ్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండగా… ఉదయ్ తన కుటుంబానికి సంబంధించిన వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

మిస్సింగ్ కేసులు నమోదు….

గత గురువారం రోజు ఈ యువ జంట ఇంటి నుంచి వెళ్లిపోయింది.  ఫోన్ లో కూడా అందుబాటులోకి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు…  నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో వేర్వురుగా మిస్సింగ్ కేసులు నమోదు చేశారు. గత గురువారం సాయంత్రం హరిత హోటల్ రూమ్ తీసుకున్నారు. అయితే వారు రూమ్ బయటకు రాలేదు. రూమ్ లోకి వచ్చి 24 గంటలు దాటిపోవటంతో… రూమ్ సిబ్బంది డోర్ పై కొట్టారు. లోపటి నుండి ఎటువంటి స్పందన రాలేదు.ఆందోళన చెందిన హోటల్ సిబ్బంది… కిటికీ ఓపెన్ చేసి చూశారు. ఇద్దరు కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఉండటంతో  షాక్ తిన్నారు. వెంటనే మునిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీస్ ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మెడలో మంగళసూత్రంతో ......

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ తర్వాత మాట్లాడారు.  మౌనిక, ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గదికి వచ్చే సమయంలోనే మంగళసూత్రం, పసుపు, కుంకుమ తెచ్చుకున్నారని చెప్పారు. అదే గదిలో ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరోవైపు మూడు నెలల కిందటే ఉదయ్ తండ్రి బాలకిషన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో తల్లి బైరమ్మ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే తండ్రి చేసే మిర్చి వ్యాపారాన్ని ఉదయ్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలోనే ఉదయ్ కూడా సూసైడ్ చేసుకోవటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  మూడు నెలలో తేడాతోనే భర్త, కొడుకు మరణించటంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది.

రిపోర్టింగ్ : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.

Whats_app_banner