Apoori Somanna : వైఎస్ఆర్టీపీకి ఏపూరి సోమన్న గుడ్ బై..! త్వరలోనే BRSలో చేరిక
Apoori Somanna News: వైఎస్ఆర్టీపీ నేత ఏపూరి సోమన్న ఆ పార్టీని వీడనున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ ను కలిశారు.
Apoori Somanna Meet KTR : వైఎస్ఆర్టీపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఏపూరి సోమన్న… త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఏపూరి సోమన్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ తో పాటు ఇతర నాయకులు ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు
బహుజన యుద్ధనౌకగా…
ఏపూరి సోమన్నకు బహుజన యుద్ధ నౌకగా పేరుంది. వామపక్ష ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించారు. కళాకారుడిగా తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించారు. తెలంగాణ సాధన కోసం అనేక పాటలన పాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన సోమన్న…. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీలో కొంత కాలం పని చేసిన ఆయన… కాంగ్రెస్ లో సాంస్కృతిక కార్యక్రమ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పార్టీలో సరైన గుర్తింపు లేదని భావించిన ఏపూరి సోమన్న… వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీలో చేరారు. షర్మిల ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు.
తుంగతుర్తిలో వైఎస్ షర్మిల తలపెట్టిన బహిరంగ సభలో… తుంగతుర్తి వైఎస్ఆర్టీపీ అభ్యర్థిగా ఏపూరి సోమన్న పేరను ప్రకటించారు. అయితే గత కొద్దిరోజులుగా చూస్తే… వైఎస్ షర్మిల అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని అగ్రనేతలతో చర్చలు జరపగా…త్వరలోనే వైఎస్ఆర్టీపీని విలీనం చేయనున్నారు. షర్మిల నిర్ణయం పట్ల…ఆమెతో పాటు సోమన్న లాంటి నేతలు అంసతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన…వైఎస్ఆర్టీపీని వీడి… బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.