Yadagirigutta Kakatiya Statue : కాకతీయ కాలం నాటి అరుదైన వీరవనిత విగ్రహాన్ని గుర్తించిన చరిత్రకారులు-yadagirigutta bhongir district kakatiya period veera vanitha statue found historians ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Yadagirigutta Kakatiya Statue : కాకతీయ కాలం నాటి అరుదైన వీరవనిత విగ్రహాన్ని గుర్తించిన చరిత్రకారులు

Yadagirigutta Kakatiya Statue : కాకతీయ కాలం నాటి అరుదైన వీరవనిత విగ్రహాన్ని గుర్తించిన చరిత్రకారులు

Published Apr 30, 2024 05:02 PM IST HT Telugu Desk
Published Apr 30, 2024 05:02 PM IST

  • Yadagirigutta Kakatiya Statue : యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లాలో కాకతీయ కాలానికి చెందిన అరుదైన వీరవనిత విగ్రహాన్ని చరిత్రకారులు గుర్తించారు. అదేవిధంగా 6 వేల ఏండ్ల నాటి కొత్తరాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లాలోని భూపతిపూర్ లో చరిత్రకారులు గుర్తించారు.

యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామం శివారులో పాటిగడ్డమీద శివాలయం, వైష్ణవాలయాల మధ్య కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు కుండె గణేశ్ అరుదైన, అపురూపమైన కొత్త వీరగల్లును గుర్తించారు. ఉత్తరాభిముఖురాలై రెండు చేతుల్లో బాకులతో యుద్ధం చేస్తున్న వీరవనిత తలవెనక కొప్పు ముడిచివుంది. చెవులకు కుండలాలున్నాయి. మెడలో కంటెవుంది. చేతులకు కంకణాలు, కాళ్లకు పాంజీబులున్నాయి. రవికె ధరించింది. మొలకు వీరకాసె కట్టింది. నడుమున దట్టీ ఉంది. ఈ వీరగత్తె శిల్పాన్ని చెక్కిన గ్రానైట్ బండపలక 5 అడుగులకన్నా ఎత్తుంది. తలపైన తోరణం చెక్కుడు గీతలున్నాయి.

(1 / 4)

ఒక చేత కత్తి, మరొక చేత డాలు ధరించి యుద్ధం చేసే వీరులు, వీరగత్తెల వీరగల్లులు చాలా ఉన్నాయి. కానీ, ఇట్లా రెండు చేతుల్లో కైజారులతో యుద్ధరంగంలో డాకాలు ముందు నిలిపి నిలిచిన స్త్రీని వీరగా చూడడం అరుదు అని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. ‘‘ఈ శిల్పం శైలినిబట్టి కాకతీయకాలానికి చెందినట్టుగా కనిపిస్తున్నది. శత్రువులతో పోరాడి, వీరస్వర్గం అలంకరించిన వీరవనిత స్మారకంగా వేసినదే ఈ వీరశిల’’ అన్నారు.

(2 / 4)

6 వేల ఏండ్లనాటి కొత్తరాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లాలోని భూపతిపూర్ లో చరిత్రకారులు గుర్తించారు. అపురూపమైన రాతిపరికరాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు కనుగొన్నారు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో గతంలో వృక్షశిలాజాలు దొరికిన ప్రదేశంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చీడం రవి 6 వేల సం.రాల కిందటి కొత్తరాతియుగం నాటి కంకణశిల (Ring Stone) ను గుర్తించారు.  ఈ రాతిపరికరాన్ని తవ్వుకోల మీద బరువుగా, వలలను ముంచే బరువుగా, పూసలను మెరుగుపెట్టడానికి ఆధారంగా ఉపయోగపడేదని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అని వివరించారు.

(3 / 4)

ఇటువంటి శిలను ఇంతకుముందు కర్ణాటక రాష్ట్రంలోని సంగనకల్లులో ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొ. రవి కొరిసెట్టర్ తవ్వకాలలో సేకరించాడు. ఆ పరికరమిపుడు బళ్ళారి మ్యూజియంలో ఉంది. ఇనుము కనుగొన్న కాలంలోనే కఠినమైన డోలరైట్ రాయిని కంకణశిలగా మలచడం ఎట్ల సాధ్యమైందో అనిపిస్తుంది. ఈ కంకణశిల తయారి, అప్పటి కళాకారుల పనితీరుకు నిదర్శనమని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

(4 / 4)

ఇతర గ్యాలరీలు