Kamareddy Crime: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని,ప్రియునితో కలిసి భర్తను చంపేసిన మహిళ
Kamareddy Crime: అక్రమ సబందం మరొక ప్రాణం బలి తీసుకుంది. భర్త ఉండగానే మరొక యువకుని తో సంబంధం పెట్టుకున్న, ఒక వివాహిత తన ప్రియునితో కలిసి భర్తను బండరాళ్లతో మోదీ చంపినా సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. కామారెడ్డి జిల్లాలోని బిక్నురు మండలంలోని మళ్లుపల్లిలో ఈ ఘటన జరిగింది.
Kamaredy Crime: కామారెడ్డిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. బిక్నూరు మండలం మళ్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42), సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఉన్న రెడ్డి ఘనపూర్ లో ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థలో మూడేళ్లుగా సీఈఓ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య లక్ష్మి (40) వారి ఇద్దరు పిల్లలతో కలిసి, తన స్వంత గ్రామంలోనే ఉంటూ పిల్లలను చదివిస్తుంది.

యువకుడితో అక్రమ సంబంధం..
గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ లో పనిచేస్తున్న లక్ష్మి, బిక్నురు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. పార్టీలో పని చేస్తుండగా, అదే మండలానికి చెందిన ఎస్సి మోర్చా అధ్యక్షుడు కడారి రాకేష్ (28) తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త, వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది.
భార్య ప్రవర్తన పైన అనుమానం వచ్చి నారాయణ పలుమార్లు లక్ష్మిని హెచ్చరించాడు. అయినా తన ప్రవర్తను మార్చుకోలేదు లక్ష్మి. పెద్దమనుషులు, కుటుంబసభ్యులు మధ్య కూడా పలుమార్లు భార్యకు నచ్చచెప్పటానికి ప్రయత్నం చేసాడు నారాయణ. ఈ పరిణామాల మధ్యలో ఇటీవల లక్ష్మి కూడా తన భర్త దగ్గరికి వచ్చి ఉండటం మొదలుపెట్టింది.
ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని.…
ప్రియునికి దూరమైన లక్ష్మీ ఎలాగైనా భర్తను అడ్డు తొలిగించుకుంటే తాము ఇద్దరమూ కలిసి ఉండొచ్చని ఆలోచన చేసింది. ఇదే విషయాన్ని రాకేష్ కు చెప్పడటంతో, రాకేష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నారాయణను చంపటానికి పన్నాగం పన్నారు.
గత గురువారం రోజు సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన నారాయణ మళ్లీ తిరిగి రాలేదు. ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకపోవటంతో, ఏమి తెలియనట్టు లక్ష్మీ శుక్రవారం హత్నూరు పోలీస్ స్టేషన్ లో తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు, మండలంలోని పల్పనూర్ గ్రామా శివారులో సోమవారం గుర్తు తెలియని శవం లభించడంతో కేసు చిక్కుముడి వీడింది.
రాళ్లతో, కట్టెలతో కొట్టి…
గుర్తు తెలియని శవాన్ని నారాయణగా గుర్తించిన పోలీసులు, విచారణ మొదలు పెట్టి హత్యలో లక్ష్మి హస్తం ఉన్నట్టు తేల్చారు. విచారణలో, తానే తన భర్తను ప్రియుడు రాకేష్ తో కలిసి చంపినట్టు ఒప్పకున్నది. రాకేష్, తన ముగ్గురు స్నేహితులతో కలిసి, రెడ్డి ఖానాపూర్ కు గురువారం వచ్చారు.
భర్త బయటకి వెళ్లిన విషయం రాకేష్ కు సమాచారం ఇవ్వటంతో, అతని వెనుక వెళ్లిన రాకేష్ తన స్నేహతులు కలిసి కర్రలతో, రాళ్లతో ాదడి చేసి చంపి, ముళ్ళ పొదల్లో శవాన్ని పడేసి మల్లి బిక్నురుకి వెళ్లిపోయారు. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.