Telangana CID : 1987లో కేసు.. 36 ఏళ్ల తర్వాత CIDకి చిక్కిన నిందితురాలు-woman absconding for 36 years nabbed by telangana cid police in kerala ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Woman Absconding For 36 Years Nabbed By Telangana Cid Police In Kerala

Telangana CID : 1987లో కేసు.. 36 ఏళ్ల తర్వాత CIDకి చిక్కిన నిందితురాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 01, 2023 02:33 PM IST

Telangana CID Police: వైట్ కాలర్ నేరం కేసులో తప్పించుకొని తిరుగుతున్న ఓ మహిళను 36 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. కేరళ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఆమెను జైలుకు తరలించారు.

36 ఏళ్ల తర్వాత సీఐడీకి చిక్కింది
36 ఏళ్ల తర్వాత సీఐడీకి చిక్కింది

Woman Absconding For 36 Years: 1987లో ఆమెపై ఆర్థిక నేరం కింద కేసు నమోదైంది. మొదటి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారించగా... ఆ తర్వాత ఈ కేసును తెలంగాణ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలవురిని అరెస్ట్ చేయగా.. ఓ మహిళ(A-11) మాత్రం తప్పించుకొని తిరుగుతోంది. ఆమె కోసం గాలిస్తున్నప్పటికీ... కొన్ని సంవత్సరాలుగా ఆచూకీ దొరకలేదు. కానీ 36 ఏళ్ల తర్వాత నిందితురాలి జాడ తెలిసిందే. కేరళలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... అక్కడి చేరుకొని అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ట్రావెన్‌కోర్‌ ఫైనాన్స్‌ కేసులో మోస్ట్‌ వాంటెడ్‌ నిందితురాలుగా ఉన్నది మరియమ్మ (అలియాస్‌ లీలమ్మ జోసెఫ్). 1987లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినప్పటికీ.. మరియమ్మ దొరకలేదు. కానీ తెలంగాణ సీఐడీ పోలీసులు సోమవారం ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె వయసు 69 ఏళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.ఈ కేసులో 11వ నిందితురాలిగా ఉన్న మరియమ్మ పరారీలోనే ఉండడంతో.. ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు.

ప్రత్యేక బృందం...

రాచకొండ సీపీ తర్వాత తెలంగాణ సీఐడీ బాధ్యతలు చూస్తున్నారు మహేష్ భగవత్. కొత్తగా బాధ్యతలు తీసుకున్న భగవత్... పాత కేసులపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే 1987 నాటి ఈ కేసు కూడా తెరపైకి వచ్చింది. మరియమ్మపై కేసు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అయితే వెంటనే ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కీలక సమాచారాన్ని రాబట్టారు.మరియమ్మ కేరళలోని పతనంతిట్టలో ఉన్నట్లు గుర్తించి... అక్కడి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రత్యేక బృందం కేరళ వెళ్లి ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ిక్క న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు. నిందితురాలి జాడ కనిపెట్టి అరెస్ట్ చేయటంపై డీజీపీ అంజనీ కుమార్... సీఐడీ అధికారులను అభినందించారు.

IPL_Entry_Point