Hyderabad : మందు బాబులు, మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం అన్ని బంద్!-wine and meat shops to closed on republic day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : మందు బాబులు, మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం అన్ని బంద్!

Hyderabad : మందు బాబులు, మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం అన్ని బంద్!

Hyderabad : ఆదివారం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో మాంసం షాపులు రద్దీగా ఉంటాయి. వైన్స్ కిటకిటలాడతాయి. కానీ.. ఈ ఆదివారం ఆ ఛాన్స్ లేదు. రిపబ్లిక్ డే సందర్భంగా మాంసం షాపులు, వైన్స్, బార్లను క్లోజ్ చేయనున్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచే వైన్స్ దగ్గర రద్దీ నెలకొంది.

మందు బాబులు, మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్ (istockphoto)

ఆదివారం.. హైదరాబాదీలకు స్పెషల్ డే. సండే వస్తే చాలు.. ఇంట్లో ముక్క వండాల్సిందే. చుక్క దిగాల్సిందే. ప్రతీ ఆదివారం హైదరాబాద్ సహా జిల్లాల్లో టీ షాపుల దగ్గర కంటే ఎక్కువ మటన్, చికెన్ షాపుల దగ్గరే రద్దీ ఉంటుంది. సెలవు కావడంతో రెండు మూడు పెగ్గులు కూడా వేస్తారు. కానీ జనవరి 26 ఆదివారం నాడు ఆ అవకాశం లేకుండా పోతోంది.

చుక్కా.. ముక్కా ఉండదు..

ఈ ఆదివారం హైదరాబాద్‌లో డ్రై డేగా ఉండనుంది. ముక్కా, చుక్కా దొరకదు. అందుకు కారణం రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీ.. ఆదివారం రావడమే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మందు, మాంసం అమ్మటంపై నిషేధం ఉంది. అటు వైన్ షాపులు, బార్లను మూసేస్తారు. పబ్స్ తెరుచుకోవు. రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

చర్యలు తప్పవు..

ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు బంద్‌ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్నీ పట్టణాల్లోనూ ఇదే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి జనవరి 26, ఆగష్టు 15, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం దుకాణాలు బంద్‌ ఉంటాయి.

ప్రత్యేక రోజుల్లో..

మరిన్ని ప్రత్యేక రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు.. మద్యం దుకాణాలు బంద్‌ చేయిస్తారు. అయితే.. ఆదివారం మద్యం షాపులు బంద్ కానుండటంతో.. శనివారం మధ్యాహ్నం నుంచే మందుబాబులు షాపుల వద్ద క్యూకట్టారు. వైన్స్ మళ్లీ జనవరి 27న సోమవారం నాడు తెరుచుకోనున్నాయి.

ఏపీలోనూ..

రిపబ్లిక్ డే సందర్భంగా అన్నీ చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు మూసి వేయాలని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, కర్నూలు నగరాల్లోనూ అధికారులు ఇదే ఆదేశాలను జారీ చేశారు.