TG Ration cards: తెలంగాణలో సంక్రాంతికైనా రేషన్ కార్డులు వచ్చేనా? ఆశావాహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..-will ration cards issue in telangana for sankranti excitement continues among aspirants ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ration Cards: తెలంగాణలో సంక్రాంతికైనా రేషన్ కార్డులు వచ్చేనా? ఆశావాహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..

TG Ration cards: తెలంగాణలో సంక్రాంతికైనా రేషన్ కార్డులు వచ్చేనా? ఆశావాహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..

HT Telugu Desk HT Telugu
Dec 31, 2024 12:34 PM IST

TG Ration cards: ప్రభుత్వం అందించే ఏ పథకానికైనా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో రేషన్ కార్డు కోసం వేచి చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం రేపు మాపు అంటూ ప్రకటనలు జారీ చేసింది.ఇటీవల క్యాబినెట్‌లో సంక్రాంతి పండుగకు రేషన్ కార్డులిస్తామనూ ప్రకటనపై ప్రజల్లో సందేహాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో సంక్రాంతికి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీపై ప్రజల్లో ఉత్కంఠ
తెలంగాణలో సంక్రాంతికి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీపై ప్రజల్లో ఉత్కంఠ

TG Ration cards: రేషన్‌ కార్డుల జారీపై తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొత్త కార్డుల జారీ పలుమార్లు వాయిదా పడటంతో ఆశావహులకు ఎదురు చూపులు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రేషన్‌ కార్డుల జారీపై ప్రకటనలు జారీ చేస్తూ వాయిదా వేస్తూ కేవలం రెండుసార్లు మాత్రమే స్వల్ప సంఖ్యలో రేషన్ కార్డులు అందించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2016 నుంచి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 2019లో కొన్ని కార్డులు అందించి ఆ వెబ్‌సైట్‌ మూసివేసింది.

yearly horoscope entry point

ఇదే తీరున కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సంక్రాంతి పండుగ సైతం రేషన్ కార్డులు అందజేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతోందనే వాదనలు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు ప్రకారం జిల్లాలోని సివిల్ సప్లై శాఖ కొత్త రేషన్ కార్డులు జారీకి సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల నుండి అధికారులు అర్హుల జాబితాలను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం గా అర్హుల ఎంపికను చేపడుతోంది. కొత్త నిబంధనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ,, మహారాష్ట్ర, పంజాబ్ లలో ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేశారో అదే రీతిన మన తెలంగాణ ప్రభుత్వం సైతం నిబంధనల మార్పులు చేసినట్టు తెలుస్తుంది.

ప్రజా సంక్షేమలో భాగంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది, ప్రభుత్వం నుంచి పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో కొత్త రేషన్ కార్డులు లేకపోవడంతో అర్హులైన వారికి కూడా అనర్హతకు గురవుతున్నారు.

రేషన్ కార్డులో గల్లంతయిన పేర్లు, కొత్తగా జన్మించిన పేర్లు, పెళ్లి చేసుకున్న వారి పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. అయితే ఇటీవల ప్రజా పాలనలో భాగంగా సంక్షేమ పథకాలు లబ్ధి కోసం..రేషన్ కార్డుల దరఖాస్తుల కూడా స్వీకరించారు. ఇప్పటివరకు రేషన్ కార్డులు జారీ చేయలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల శాసనసభల్లో సమావేశాలు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనట్లు మంత్రి ఉత్తరం కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి, కానీ కార్డుల జారిపై మారదర్శకాలు నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదని పాత దరఖాస్తులు పరిగణలోకి తీసుకుంటారా? ప్రజాపాలనలో తీసుకున్న సమీకృత దరఖాస్తుల ఆధారంగా కార్డులు జారి చేస్తారా అనే సందేహం నెలకొంది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అధికారులకు కసరత్తు చేస్తున్నారు, సర్పంచుల పదవీకాలం ముగిసి 11నెలలు కాకావస్తోంది, మరో నెల రోజులైతే పుర సంఘాల ఎన్నికలు రానున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అధికారులు సన్నాఫ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా విడుదల చేశారు. నోడల్ అధికారులు సైతం నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రకటిస్తే తెల్ల రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీకి బ్రేకులు పడ్డ ట్లేననే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.

(రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner