TS Assembly Elections : కేసీఆర్ పోటీ చేసే ప్లేస్ మారబోతుందా..! గులాబీ బాస్ గురి ఎటువైపు..?-will kcr contest from south telangana in the upcomming assembly elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Will Kcr Contest From South Telangana In The Upcomming Assembly Elections

TS Assembly Elections : కేసీఆర్ పోటీ చేసే ప్లేస్ మారబోతుందా..! గులాబీ బాస్ గురి ఎటువైపు..?

HT Telugu Desk HT Telugu
May 06, 2023 07:18 AM IST

Telangana Assembly Election 2023: ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన పార్టీలు వ్యహలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Party Latest News: కేసీఆర్..... వ్యూహాలు రచించటంలో దిట్ట..! ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ... ప్రత్యర్థి పార్టీలను ఈజీగా బోల్తా కొట్టించేస్తారు..! సూటిగానే పదునైన మాటలతో... టార్గెట్ చేసి ఏకిపారేస్తారు.. ! కాస్త సైలెన్స్ గా ఉన్నారంటే... ఏదో మాస్టర్ స్కెచ్ తో ముందుకువస్తారన్నట్లు ఉంటుంది ఆయన తీరు..! ఆయన తీసుకొనే కొన్ని నిర్ణయాలు కూడా ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి..! ఇదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... స్కెచ్ రెడీ చేసే పనిలో పడ్డారు గులాబీ బాస్ కేసీఆర్..! ఇప్పటికే జిల్లాల వారీగా రేస్ గుర్రాలపై ఫోకస్ పెట్టడమే కాదు... మార్చాల్సిన అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీతోనే ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్న చర్చ జోరందుకుంది. ఈసారి గజ్వేల్ నుంచి కాకుండా... వేరే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది కాస్త తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

ప్లేస్ మారుతుందా..?

ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్... గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. అయితే ఈసారి ఇదే స్థానం నుంచి పోటీ చేయకపోవచ్చని... వేరే స్థానం నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ... ఈ చర్చ పొలిటికల్ సర్కిల్ లో గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని ఏదో ఒక సీటు నుంచి పోటీ చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పేరు వినిపిస్తోంది. ఇక్కడ కుదరకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా బరిలో ఉంటారన్న చర్చ ఓ వైపు నుంచి వినిపిస్తోంది. కేసీఆర్ స్థాయి వ్యక్తి ఇక్కడ్నుంచి బరిలో ఉండటం ద్వారా... దక్షిణ తెలంగాణపై ప్రభావం ఉంటుందని, మెజార్టీ స్థానాలను గెలిచే అవకాశం ఉంటుందన్న భావనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఆర్థిక మంత్రి హరీశ్ రావ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమ జిల్లాల నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్ కూడా కేసీఆర్ సీటు మారుతారాన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

ఈసారి ఉత్తర తెలంగాణకు చెందిన జిల్లాల నుంచి కాకుండా... ఇతర జిల్లాల్లోని ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి కేసీఆర్ బరిలో ఉంటారని తెలుస్తోంది. ఫలితంగా 20 నుంచి 30 నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని భావిస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఈ ప్లాన్ ను వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ కేవలం అసెంబ్లీ బరిలోనే కాకుండా.. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా ఎన్నికలను ఓ టాస్క్ లా భావిస్తామని చెప్పే కేసీఆర్.... వచ్చే శాసనసభ ఎలక్షన్స్ విషయంలోనూ ఓ క్లారిటీతోనే ఉన్నారన్న చర్చ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం అనుకుంటున్నట్లు కేసీఆర్ నిజంగానే... సీటు మారుతారా..? దక్షిణ తెలంగాణ నుంచి పోటీ చేయడం ఖాయమేనా...? అనేది మరికొద్ది నెలల్లోనే తేలిపోనుంది...!

IPL_Entry_Point

సంబంధిత కథనం