TG MLC Election : వరుస పరాభవాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా.. 10 ముఖ్యమైన అంశాలు
TG MLC Election : బీఆర్ఎస్.. ఒకప్పుుడు ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న పార్టీ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘార పరాభవం తర్వాత.. బీఆర్ఎస్ వీక్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో త్వరలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జరగనుంది. ఈ ఎన్నిక్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే.. వరుస పరాభవాలతో దెబ్బతిన కారు పార్టీ.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఈసారికి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే చర్చ పార్టీలో జరిగినట్టు తెలుస్తోంది.
కారణాలు ఏంటీ..
1.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి ఊదింది ఉత్తర తెలంగాణ. అయితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉత్తర తెలంగాణ జిల్లాలను విస్మరించారనే ప్రచారం జరిగింది.
2.ఇటీవల జరిగిన నల్లగొండ– ఖమ్మం –వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని బరిలోకి దించింది. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ మరింత వీక్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.
3.గతంలో జరిగిన కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్– మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున చంద్రశేఖర్ గౌడ్ ను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రశ్నించే గొంతుక నినాదంతో బరిలోకి దిగిన జీవన్ రెడ్డి గెలిపించారు.
4.ఈ అనుభవాలన్నీంటిపైనా చర్చించిన బీఆర్ఎస్.. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
5.ఈ ఎన్నికలకు సంబంధించి.. పార్టీలో కనీసం అభ్యర్థి ఎవరనే చర్చకూడా జరగడం లేదని తెలుస్తోంది.
6. కొందరు బీఆర్ఎస్ మాత్రం భిన్న వాదనను తెరపైకి తెచ్చారు. ఉద్యమానికి అండగా ఉన్న జిల్లాల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని కేసీఆర్‌తో అన్నట్టు తెలిసింది.
7.ఈ అంశంపైనా పార్టీలో చర్చ జరిగినట్టు సమాచారం. కానీ.. ఈసారి స్వతంత్రులకే మద్దతిచ్చేందుకే కేసీఆర్, ముఖ్య నాయకులు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
8.డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. అటు ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా బీఆర్ఎస్ చురుగ్గా లేదని టాక్ ఉంది.
9.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 మంది వరకు ఉన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీజేపీ నేత సుగుణాకర్ రావు, ట్రస్మా ప్రతినిథి యాదగిరి శేఖర్ రావు, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ బీఎన్ రావు, డాక్టర్ హరికృష్ణ, పోకల నాగయ్య, ప్రసన్న హరికృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కానీ క్లారిటీ లేదు.
10.ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో 20 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారు. వీరిలో 50 శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది.