Munugode BJP : మునుగోడులో కమలం వికసిస్తుందా?
Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక దగ్గరకు వచ్చింది. మిగిలింది.. సమరమే. దుబ్బాక, హుజూరాబాద్ లో పనిచేసిన మ్యాజిక్ ఇక్కడ పనిచేస్తుందా? మునుగోడులో కమలం వికసిస్తుందా?
మునుగోడులో ఎలాగైనా గెలిచి.. తమ పార్టీని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా హిస్టరీ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం అస్త్రశస్త్రలు ఉపయోగిస్తుంది. నేతలంతా మునుగోడు(Munugode)లోనే మకాం వేశారు. బీజేపీ అభ్యర్థికి బరిలో ఉన్న.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) సొంత చరిష్మాతో మునుగోడులో గెలుస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ సైతం.. ఈ ఉపఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది.
అయితే ఇక్కడ బీజేపీ(BJP) అనేకంటే.. ఎక్కువ శాతం టీఆర్ఎస్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే చర్చనే నడుస్తోంది. ఆయన కూడా ఉప పోరును అలానే తీసుకొచ్చారు. బూత్ స్థాయిలో కొంతమంది ఓటర్లకు ఇన్ఛార్జిలను నియమించారు. మరోవైపు అన్ని పార్టీలతోనూ కోమటిరెడ్డికి ఎంతో కొంత సఖ్యత ఉంది. ఇది తనకు కలిసొస్తుందని ఆయన అనుకుంటున్నారు. మరోవైపు కోమటిరెడ్డి(Komatireddy) వ్యక్తిగతంగా సాయం చేసిన వారు చాలామంది ఉంటారని చెబుతుంటారు.
బీజేపీలోకి కోమటిరెడ్డి వస్తు్న్న సమయంలో చాలామంది కాంగ్రెస్(Congress) స్థానిక నేతలతో ఆయన వెంట తెచ్చుకున్నారు. ఈ అంశం బాగా కలిసి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరో వైపు కేంద్రమంత్రులు మండలాల వారీగా సభ కూడా బీజేపీకి ప్లస్ అవుతుంది. ఈటల రాజేందర్ లాంటి నేతలకు స్థానికంగా సంబంధాలు ఉండటం కూడ కలిసి వస్తోంది.
అయితే మరోవైపు కాంగ్రెస్ సీటు కదా పోతే పోని అని సీఎం కేసీఆర్(CM KCR) కూడా అనుకోవట్లేదు. బీజేపీకి ధీటుగా పోరాడుతున్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అంతా మునుగోడులోనే మకాం వేశారు. కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితే కలిసివస్తోందని టీఆర్ఎస్ అనుకుంటోంది. దీనిపైనే బీజేపీ కాస్త భయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
తెలంగాణ(Telangana)లో బీజేపీ గ్రాఫ్ పెంచుకునేందుకు మునుగోడు సరైన వేదికగా కమలం పార్టీ అనుకుంటోంది. నల్గొండ జిల్లాలో బీజేపీ వీక్ గా ఉన్న పార్టీ. ఇక్కడ కూడా గెలిచి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రజల్లోకి వచ్చే ఎన్నికల్లో బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగానే కీలక నేత బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) లాంటి వారిని బీజేపీ తమ వైపు తిప్పుకొంది. ఆయన ద్వారా ఎంతో కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ స్కెచ్ ను పసిగట్టిన టీఆర్ఎస్ దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లాంటి నేతలను గులాబీ పార్టీలోకి తీసుకెళ్లింది.
రాజ్‌గోపాల్(Rajagopal)కు గతంలో తనకు పడ్డ 99 వేల ఓట్లలో 67 నుంచి 70 శాతం తిరిగి సెక్యూర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2018 లో బీజేపీకి వచ్చిన ఓట్లు 12 వేల పైచిలుకు కూడా కలుపుకొంటే.. రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం అవుతుంది. పెన్షనర్లు, వృద్ధులు, వ్యాపారస్తులు, రైతులు కేసీఆర్ కు మద్దతుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కమలం పార్టీ ఆలోచనల్లో పడింది. ఎలాగైనా గెలుస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ధీమాతో ఉన్నారు. ఎవరు గెలిచినా 5 నుంచి 12 వేల ఓట్ల తేడా ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి.