Medak Murder: మెదక్‌లో దారుణం, వైద్యానికి డబ్బులు దండగని భర్తను చంపేసిన భార్య, అంత్యక్రియల్లో గుర్తించిన బంధువులు-wife kills husband who couldnt afford medical treatment relatives identify him at funeral ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Murder: మెదక్‌లో దారుణం, వైద్యానికి డబ్బులు దండగని భర్తను చంపేసిన భార్య, అంత్యక్రియల్లో గుర్తించిన బంధువులు

Medak Murder: మెదక్‌లో దారుణం, వైద్యానికి డబ్బులు దండగని భర్తను చంపేసిన భార్య, అంత్యక్రియల్లో గుర్తించిన బంధువులు

Sarath Chandra.B HT Telugu

Medak Murder: మెదక్‌లో దారుణ హత్య జరిగింది. ప్రమాదవశాత్తూ గాయపడి, మంచాన పడిన భర్తకు వైద్యం చేయించడం ఖర్చుతో కూడిన పనిగా భావించిన భార్య.. అల్లుడితో కలిసి ఉరేసి చంపేసింది. అంత్యక్రియల్లో మెడపై గాయాలు గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.

మెదక్‌లో దారుణం, మంచాన పడిన భర్తను ఉరేసి చంపిన భార్య

Medak Murder: పొలం పనికి వెళ్లిన భర్త ప్రమాదం బారిన పడి మంచాన పడ్డాడు. పొలంలో కింద పడటంతో తుంటి విరగడంతో శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. భర్త వైద్యానికి అయ్యే డబ్బులు ఎక్కడ నుంచి తీసుకు రావాలని భావించిందో, మరో కారణమో స్పష్టత లేదు కానీ భర్తను చంపేయాలని భార్య డిసైడ్ అయ్యింది. మెదక్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. అంత్య క్రియల సమయంలో శవం మెడపై కమిలిన గాయాలు గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది.

మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివమ్మ దంపతులకు ఓ కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. వీరికి ఉన్న ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక పోవడంతో కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.

కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వీరి కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. కూతురు లావణ్యను జూకల్‌కు చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసి అతడిని ఇల్లరికం తెచ్చుకున్నారు.

ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల తనకున్న పొలంలో బోరు వేసి ఆ భూమిని వ్యవసాయానికి అనువు మార్చుకున్నాడు. గత శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ఆశయ్యకు శస్త్ర చికిత్స చేయడానికి రూ.50 వేలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు.

ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులపై ఆశయ్య భార్య ఇతర కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకున్నారు. డబ్బు ఎలా భరించాలి అనుకున్నారో,ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్‌తో కలిసి, శివమ్మ నిద్రలో ఉన్న ఆశయ్య మెడకు తువ్వాలుతో ఉరేసి చంపేశారు. ఆ తర్వాత గ్రామస్తులకు ఆశయ్య నిద్రలో చనిపోయాడని చెప్పారు.

సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని అంత్య క్రియల కోసం తరలించిన సమయంలో అనూహ్యగా పోలీసలు మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఆసయ్య సోదరి ఫిర్యాదు చేయడంతో దింపుడు కల్లం వద్ద మృతదేహాన్ని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. శవాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం