Extra Marital Affair : బావతో ఎఫైర్.. దుబాయ్ నుంచి వచ్చి చూసిన భర్త-wife killed husband with her lover in kodimyala jagtial district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Wife Killed Husband With Her Lover In Kodimyala Jagtial District

Extra Marital Affair : బావతో ఎఫైర్.. దుబాయ్ నుంచి వచ్చి చూసిన భర్త

HT Telugu Desk HT Telugu
Nov 21, 2022 06:49 PM IST

Telangana Crime News : వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణమైనా చేయిస్తాయి. పచ్చని కాపురాలను నాశనం చేస్తాయి. ఒక్కొసారి హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తాయి. జగిత్యాల జిల్లాలో ఇలానే.. భర్త చావుకు భార్య కారణమైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధాల(Extra Marital Affair)తో జీవిత కాలం ఉండే బంధాలు నాశనమవుతున్నాయి. పచ్చటి సంసారాలు కుప్పకూలిపోతున్నాయి. క్షణికావేశంలో హత్య(Murder)లు చేసే స్థాయికి తీసుకెళ్తున్నాయి వివాహేతర సంబంధాలు. జగిత్యాల(Jagtial) జిల్లాలో జరిగిన ఘటన మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. భార్యను ఎంతో ప్రేమించిన భర్త.. వివాహేతర సంబంధం కారణంగా ప్రాణాలు పొగొట్టుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్‌తో దేశాయిపేటకు చెందిన వేముల ప్రమీలకు పదేళ్ల క్రితం పెళ్లి(Marriage) జరిగింది. మెుదట్లో వీరిద్దరూ సంతోషంగా ఉండేవారు. వీరికి సంతానం లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా శ్రీను దుబాయ్(Dubai) వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. కొన్నేళ్లు వెళ్లాడు. డబ్బులు సంపాదించి భార్యను సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాడు.

అయితే భర్త దుబాయ్ వెళ్లడంతో భార్య ప్రమీల మనసు మారింది. ఇక్కడ నుంచి వాళ్ల జీవితంలో చీకటి ప్రవేశించింది. ప్రమీలకు బావ వరుస అయ్యే.. దేశాయిపేట(Deshaipeta)కు చెందిన సూర రాజేశ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా రోజులుగా వీళ్ల సంబంధం నడుస్తోంది. ఈ క్రమంలోనే దుబాయ్(Dubai) నుంచి శ్రీను వచ్చాడు. అయినా ప్రమీల వివాహేతర సంబంధం కొనసాగించింది. ఓ రోజు శ్రీనుకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. భార్యను వదులుకోలేని భర్త.. పలుసార్లు హెచ్చరించాడు. చివరకు పెద్దల మనుషుల పంచాయితీ పెట్టారు. అయినా ఫలితం లేదు.

భార్య తనకు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేని శ్రీను మద్యానికి బానిసయ్యాడు. అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. తమ సంబందానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని ప్రియుడు రాజేశ్ తో కలిసి భార్య(Wife) ప్రమీల ప్లాన్ వేసింది. ఈ పథకంలో ప్రమీల తల్లిదండ్రులు రాజవ్వ, రాజనర్సు కూడా భాగమయ్యారు. రాజవ్వ వాడుతున్న ట్యాబ్లెట్లను ఓ రోజు ప్రమీల పొడిగా చేసింది. నవంబర్ 11వ తేదీన శ్రీను తాగే మద్యంలో కలిపారు.

ఇక శ్రీను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే తమ ప్లాన్ ప్రకారం.. ప్రమీల, ఆమె ప్రియుడు రాజేశ్ కలిసి టవల్ తో శ్రీను గొంతుకు కట్టి.. ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. వెంటనే ఓ చీర తీసి దూలానికి ఉరివేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్య(Suicide)గా క్రియేట్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారు అయ్యారు. మృతుడి సోదరుడు రవి పోలీసు(Police)లకు ఫిర్యాదు చేశాడు. వదినపై అనుమానం వ్యక్తం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. శ్రీనును చంపింది.. భార్య ప్రమీల, ఆమె తల్లితండ్రులు, ప్రియుడు రాజేశ్ గా తేల్చారు.

ఆదివారం రోజున నలుగురిని పోలీసు(Police)లు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన టవల్, ట్యాబ్లెట్‌ షీట్లతోపాటు, బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. కేసు వివరాలను కొడిమ్యాల(Kodimyala) పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ ఆర్‌.ప్రకాశ్, మల్యాల సీఐ డి.రమణమూర్తి, ఎస్సై కె.వెంకట్రావ్‌ తెలిపారు.

IPL_Entry_Point