Monsoon : నైరుతి రుతుపవనాలు వచ్చేశాయోచ్.. మూడు రోజులు వర్షాలే-weather news southwest monsoon arrives in telangana ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Weather News Southwest Monsoon Arrives In Telangana

Monsoon : నైరుతి రుతుపవనాలు వచ్చేశాయోచ్.. మూడు రోజులు వర్షాలే

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఈ మేరకు వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్టైంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వేడి కొనసాగుతూనే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సోమవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధ చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది.

నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ఆదివారం ప్రవేశించాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం కడప​, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైపు పయనించాయి. రాత్రి అక్కడక్కడ వర్షాలు, పిడుగులు పడ్డాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.

మరో మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

విశాఖలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో విమానాల లాండింగ్ ఇబ్బంది ఎదురైంది. ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాన్ని వాతావరణం అనుకూలించక హైదరాబాద్ కు మళ్లించారు. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి జయశంకర్ ఉన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో విశాఖ పుర ప్రముఖులతో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు.

WhatsApp channel

టాపిక్