Water Man Of India | నదులు నాలాలుగా మారితే భవిష్యత్ తరాలకు ఏం చెబుతారు?-water man of india rajendra singh on river manifesto ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Water Man Of India Rajendra Singh On River Manifesto

Water Man Of India | నదులు నాలాలుగా మారితే భవిష్యత్ తరాలకు ఏం చెబుతారు?

HT Telugu Desk HT Telugu
Feb 27, 2022 02:24 PM IST

చదువుకున్న వారు ఉన్న ప్రాంతాల్లోనే.. నదులు కలుషితమైనట్టు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అన్నారు. దీనికి ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాలే ఉదాహరణ అని చెప్పారు.

వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా(ఫైల్ ఫొటొ)
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా(ఫైల్ ఫొటొ) (twitter)

నదుల పరిరక్షణ, మేనిఫెస్టో తయారీ ప్రధాన ఎజెండాగా హైదరాబాద్‌లో జాతీయ సమ్మేళనం జరుగుతోంది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ నేతృత్వంలోని సదస్సుకు 27 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు రెండురోజులపాటు జరుగుతుంది. ఇవాళ రెండో రోజు. దేశంలోని నదులు, వాటి పరిస్థితులపై చర్చ జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ ఎలా అనే అంశాలపై చర్చించనున్నారు. పలు రాష్ట్రాల్లో నదులు, జలసంరక్షణ కోసం జరిగే ప్రయత్నాలపైనా చర్చిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సదస్సులో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. రాజేంద్ర సింగ్ మాట్లాడారు. గొప్పగొప్పగా చదువుకున్న వారు ఉన్న ప్రాంతాల్లోనే.. నదులు కలుషితమైనట్టు వ్యాఖ్యానించారు. అందుకు ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాలే ఉదాహరణగా చెప్పారు. హైదరాబాద్ మూసీ నది ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఇలా చేసి.. నదులు నాలాలుగా మారిపోతే భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతాం? అని ప్రశ్నించారు. నదుల పరిరక్షణకు సుప్రీం కోర్టు ఎన్ని తీర్పులు చెప్పినా.. అమలు కావడం లేదన్నారు.

అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఏడేళ్లలో వేగంగా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.., చెరువుల పునరుద్ధరణతో జలవనరులను సంరక్షించామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భవిష్యత్ లో ప్రపంచ వ్యాప్తంగా నీటి కోసమే పోరాటాలు జరిగే ప్రమాదముందని తెలిపారు. చెరువుల పునరుద్ధరణతో జలవనరులను సంరక్షించామని.. మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో.. కృష్ణా, గోదావరి నదుల్లోకి వ్యర్థాలు వెళ్లడం లేదన్నారు.  తెలంగాణ విధానాలకు కేంద్రం.. ఆదర్శంగా తీసుకుని.. అమలు చేయాల్సిన పనులను.. ఇప్పుడు రాజకీయం చేస్తోందని నీరంజన్ రెడ్డి మండిపడ్డారు. జలవనరుల సంరక్షణలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే చాలా చోట్ల నీటి కోసం వివాదాలు నడుస్తు్న్నాయని.. భవిష్యత్ లో ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు జరిగే ప్రమాదముందని నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్.. నదుల పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో.. వలస వెళ్లిన ప్రజలు.. పాలమూరుకు తిరిగి వస్తున్నట్టు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

 స్వార్థంలో పర్యావరణం నాశనం చేస్తున్నారు: జగదీశ్ రెడ్డి

ఈ సదస్సులో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఆకలి అనేదే లేకుండా చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి పథకాలతోనే ఊళ్లను వదిలివాళ్లు కూడా మళ్లీ తిరిగి వస్తున్నట్టు చెప్పారు. మానవుల స్వార్థంతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నట్టు జగదీశ్ రెడ్డి అన్నారు.

IPL_Entry_Point