Hyd Police Warning: సంధ్య థియేటర్‌ తొక్కిసలాటపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక-warning of action against social media misinformation regarding sandhya theater stampede ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Police Warning: సంధ్య థియేటర్‌ తొక్కిసలాటపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

Hyd Police Warning: సంధ్య థియేటర్‌ తొక్కిసలాటపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 25, 2024 01:41 PM IST

Hyd Police Warning: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం, తదనంతర పరిణామాలపై సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తొక్కిసలాట గురించి తప్పుడు పోస్టులు పెడితే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Hyd Police Warning: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ఇటీవల కొందరు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు …. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం పోలీసుల దృష్టికి వచ్చిందని, ఈ ఘటన పై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని వివరించారు.

yearly horoscope entry point

పోలీసులు ఘటనపై స్పష్టత ఇచ్చినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం పోలీసుల దృష్టికి వచ్చిందని, కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారుర.

తొక్కిసలాట తర్వాత జరిగిన పరిణామాలపై పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని, ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోందని పోలీసుు ప్రకటించారు. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హైదరాబాదు సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Whats_app_banner