NIT Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్' నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే-warangal nit notification for library trainee jobs 2024 full details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nit Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్' నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే

NIT Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్' నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 06, 2024 09:29 AM IST

NIT Warangal Recruitment 2024 : వరంగల్‌లోని ‘నిట్’(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. లైబ్రరీ ట్రైనీలు పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

వరంగల్ నిట్
వరంగల్ నిట్

NIT Warangal Recruitment 2024 : వరంగల్‌లోని ‘నిట్’(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. లైబ్రరీ ట్రైనీలు పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా ఐదు లైబ్రరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://nitw.ac.in/Careers/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టులను తాత్కాలిక, కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని నోటిఫికేషన్ లో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికై వారికి నెలకు రూ. 20వేల జీతం చెల్లిస్తారు. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్), వరంగల్
  • ఉద్యోగాలు - లైబ్రరీ ట్రైనీలు
  • మొత్తం ఖాళీలు - 05
  • ఈ పోస్టులను తాత్కాలిక, కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ పూర్తి చేసి ఉండాలి.
  • జీతం - రూ. 20,000 చెల్లిస్తారు.
  • దరఖాస్తు - ఆన్ లైన్
  • దరఖాస్తులకు చివరి తేదీ - నవంబర్ 30, 2024.
  • దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం - రాత పరీక్ష లేదా ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచుతారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/
  • ఆన్ లైన్ దరఖాస్తులకు లింక్ - https://contractual.nitw.ac.in/register/
  • మెయిల్ అడ్రస్ - registrar@nitw.ac.in

ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రకటన:

హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 64 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.నవంబర్‌ 7, 11 తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 64 ఖాళీలను రిక్రూట్ చేస్తారు. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు, ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలు, కోల్ కత్తా, మీరట్, ఢిల్లీ, పూణె, నాగ్ పూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కైగా కేంద్రాల్లో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను https://www.ecil.co.in/ వెబ్ సైట్ నుంచి తీసుకోవాలి. మీ వివరాలను పూర్తి చేయాలి. నవంబర్‌ 7, 11వ తేదీల్లో నిర్వహించే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ సౌత్ జోన్ లో నవంబర్ 11వ తేదీన ఇంటర్వూలు ఉంటాయి. ముంబై వెస్ట్ జోన్ లో నవంబర్ 7వ తేదీన నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వారు మాత్రమే రావాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం