వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే నాన్ - టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా… తాజాగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
మొత్తం నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఇందులో లీగల్ అడ్వైజర్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్,అర్కిటెక్ట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. లీగల్ అడ్వైజర్ పోస్టుకు సంబంధించి మూడేళ్ల పాటు న్యాయవాదిగా పని అనుభవం ఉండాలి. మిగతా పోస్టులకు సంబంధించి నిర్ణయించిన అర్హతలు ఉండాలి.
అర్హత కలిగిన అభ్యర్థులు https://nitw.ac.in/Careers/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పోస్టును బట్టి జీతభత్యాలను నిర్ణయించారు. ఎగ్జామ్, ఇంటర్వూ, పని అనుభవం ఆధారంగా పై ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఇటీవలనే వరంగల్ నిట్ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయింది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://nitw.ac.in/Careers/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.