Kakatiya Mega Textile Park : కాకతీయ టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్ న్యూస్, 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు-warangal kakatiya mega textile park govt allocated 863 land donors to indiramma houses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kakatiya Mega Textile Park : కాకతీయ టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్ న్యూస్, 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

Kakatiya Mega Textile Park : కాకతీయ టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్ న్యూస్, 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

HT Telugu Desk HT Telugu
Nov 16, 2024 07:30 PM IST

Kakatiya Mega Textile Park : వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెక్స్ టైల్స్ పార్క్ పక్కనే భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటుచేయనున్నారు. తాజాగా 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 కాకతీయ టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్ న్యూస్, 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్ న్యూస్, 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 863 మందికి స్టేట్ రిజర్వ్ కోటా కింద ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్ అండ్ బీ సెక్రటరీ జ్యోతి బుద్ధా ప్రకాష్ ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో తొందర్లోనే కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ పక్కనే భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పడనుంది.

1,357 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం

వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో ఉన్న చింతలపల్లివద్ద గత రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.ఈ మేరకు ఆ చుట్టుపక్కల శివారు భూములలో 2016లోనే విడతల వారీగా మొత్తంగా 1,357 ఎకరాలు సేకరించింది. దీంతో దాదాపు 863 మంది భూములను కోల్పోగా.. భూ సేకరణసమయంలో పరిహారం విషయంలో అక్కడి రైతులు గొడవ చేశారు. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఎకరానికి రూ.10 లక్షల చొప్పున మాత్రమే పరిహారం చెల్లించి, రైతులు సాగు చేసుకుంటున్న భూములను మెగా టెక్స్ టైల్ పార్కు కోసం సేకరించింది. కాగా సాగు చేసుకుంటున్న భూములతోపాటు ఉపాధి కోల్పోతుండటంతో అప్పటి ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగంతో పాటు టెక్స్ టైల్ పార్క్ఏరియాలోనే ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని చెప్పింది.

అంతేగాకుండా ప్రత్యేకంగా లే అవుట్ ఏర్పాటు చేసి, డబుల్బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. చదువురాని మహిళలకు టెక్స్ టైల్పార్కులోని వస్త్రాల తయారీ ఫ్యాక్టరీల్లో ట్రైనింగ్ ఇప్పించి,అందులోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆ హామీలన్నింటినీ ఏడాదిలోగానే నెరవేర్చి రైతులకు అండగా ఉంటామని చెప్పారు. కానీ ఆ తరువాత గత ప్రభుత్వ ఇచ్చిన హామీలను విస్మరించడంతో అక్కడి రైతులు తీవ్ర అసంతృప్తికిగురయ్యారు.

ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ మెగాటెక్స్ టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి, ఆ ప్రాంతాన్ని కొత్త గ్రామ పంచాయతీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గతజూన్ 29న హంటర్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ తో పాటు గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూ బాధితులతో పాటు పార్కులో పనిచేసే ఉద్యోగులు కూడా ఇదే ఏరియాలో ఉండేలా కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక గ్రామానికి ఏమేం అవసరం ఉంటాయో అవన్నీ పార్క్ దగ్గర్లోనే ఉండేలా కాలనీ ప్రపోజల్స్ పంపాలని ఆఫీసర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో వరంగల్ కలెక్టర్ సత్య శారద ఈ విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన వివరాలతో సమగ్ర రిపోర్ట్ అందించారు. భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపాదనలు పంపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వంకాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూ నిర్వాసితులకు స్టేట్ రిజర్వ్ కోటా కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా .5 లక్షలతో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం మాటలతోనేకాలయాపన చేయగా.. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేయడంతో భూబాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం