(1 / 9)
సీఎం కేసీఆర్ వేముల రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.100 కోట్ల ఇస్తానన్న హామీ నెరవేరలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
(2 / 9)
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వార్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేశాయి.
(3 / 9)
8 సంవత్సరాల క్రితం వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దేవాలయ అభివృద్ధి కోసం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని, మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని ఆలయ గుడిమెట్ల మీద ఇచ్చిన హామీ ఇచ్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
(4 / 9)
ముఖ్యమంత్రికి సోది లేకపోతే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ జిల్లా మంత్రి నిద్రపోతున్నారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
(5 / 9)
కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా కార్యక్రమాలు చేపడతున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు
(6 / 9)
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ తలపై ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి 8 సంవత్సరాల కిందట ఇచ్చిన హామీని గుర్తుచేయాలని అనుకుంటున్నామన్నారు. కొత్తగా ఏమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు.
(7 / 9)
ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కాంగ్రెస్ నేతలు అన్నారు.
(8 / 9)
రూ.3016 నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, రైతు రుణమాఫీ గురించి ఇప్పుడు ప్రశ్నించడం లేదని, శివునికి శఠగోపం పెట్టి దైవత్వాన్ని నిర్లక్ష్యం చేసే విధంగా ఈ దేవాలయానికి ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచినట్లుగా భావిస్తున్నామని పొన్నం అన్నారు.
(9 / 9)
దేవాలయాలకు సంబంధించి యాదాద్రి ఆలయం మినహా ముఖ్యమంత్రి హామీ ఎక్కడా అమలు కాలేదని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు.
ఇతర గ్యాలరీలు